రాష్ట్రంలో జర్నలిస్టులకు మంజూరు చేసే అక్రిడిటేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందుకు సంబంధించిన జిఓ 929ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం విడుదల చేశారు. గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిపి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్ గా సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఉంటారు. సమాచార శాఖ డైరెక్టర్ ఈ కమిటీకి మార్గదర్శకాల సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
జర్నలిస్టు అక్రిడిటేషన్ల పై మంత్రివర్గ ఉపసంఘం
16
May