సికింద్రాబాద్, మే 16(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గరికపోగుల చంద్రశేఖర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను సికింద్రాబాద్‌లోని రైల్వే హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు తక్షణ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రశేఖర్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
