ప్రజావాణిలో 226 దరఖాస్తులు – దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య

హైదరాబాద్ మే 16 (జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 226 దరఖాస్తులు అందాయి.
వీటిలోపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 64, రెవెన్యూ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు 20, ఇందిరమ్మ ఇండ్ల కోసం 37 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 51 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, త్రీసభ్య కమిటీలో తుది నిర్ణయం తీసుకోవాలని కోరగా అందుకు తగిన నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని చిన్నారెడ్డి, దివ్య సమాధానం ఇచ్చారు.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *