హైదరాబాద్ మే 16(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
భారతీయ సమాజంలో అహల్య భాయ్ హోల్కర్ కు ప్రత్యేక చరిత్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కోన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ” అహల్య భాయ్ హోల్కర్ 300 వ జయంతికి సంబంధించి నిర్వహించిన వర్క్ షాప్ కు జాతీయ సహా సంఘటన మంత్రి శివ ప్రకాష్, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అహల్య భాయ్ హోల్కర్ యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో వివరించాలని ఆయన కోరారు. జాతీయ సహా సంఘటన మంత్రి శివ ప్రకాష్ జీ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో అహల్య భాయ్ హోల్కర్ 300 వ జయంతి ఉత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు. జిల్లాలలో మహాహారతి కార్యక్రమంతో పెద్దఎత్తున ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ఈ పది రోజులలో శోభయాత్రలు, వర్క్ షాపులు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయని శివ ప్రకాష్ పేర్కోన్నారు. రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ హిందు దేవాలయాల పరిరక్షణ కోసం అహల్య భాయ్ హోల్కర్ చేసిన కృషిని గర్వించాలని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు & అహల్య భాయ్ హోల్కర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆమె పాలనా కాలంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు జీవించిందని ఆయన అన్నారు. మహిళ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. సమత మాట్లాడుతూ మహిళలంతా అహల్య భాయ్ హోల్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో కో – కన్వీనర్లు డా. భోగ శ్రావణి, బండారు శైలజ, అజ్మీర బాబీ, సుధ తదితరులు పాల్గోన్నారు.

