చిరు వ్యాధుల పట్ల ఉద్యోగుల అవగాహన కలిగి వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కు చెందిన నిజామ్ ఇన్స్టిట్యూట్ ఫిజియోథెరపిస్ట్ వెంకట రమణ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశపు మందిరంలో మండలంలోని నచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామ్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థన మేరకు నచివాలయ సిబ్బందికి నిర్వహిస్తున్న అవగాహన తరగతులు ఉపయోగించుకొని బిపి, ఘగర్, ఇతర వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం ఆయా వ్యాధులు రావటానికి గల కారణాలు, నివారణ చర్యలను ఫిజియో థెరపిస్ట్ వెంకట రమణ వివరించారు. కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము నత్యం తదితరులు పాల్గొన్నారు.

