అకాల వర్షాలకు రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు
కోరారు. దారం వారి పాలెం, తూర్పుగంగవరం, సోమవర ప్పాడు క్షేత్ర పర్యటనలో భాగంగా తడిచిన వరి ఓదేలను పరిశీలించి రైతులను నూచనలు చేసారు. వరి పొలాల్లోని నీటిని బయటకు పంపి, ఓదేలపై 5శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చెయ్యాలని 20 రోజుల పాటు గింజ మొలక రాదని చెప్పారు. వంద లీటర్ల నీటికి బదు కేజీల ఉప్పు ను కలిపి, ఎకరానికి 200 లీటర్ల నీళ్లు పది కేజీల ఉప్పు పిచికారి చెయ్యాలని చెప్పారు. తెరప ఇచ్చిన వెంటనే వెలుతురు సోకే విధంగా ఓదేలను తిరగ వెయ్యాలని నూచించారు.
నువ్వులు కుప్పలు వేసారని వాటిని కూడ ఆరిన తర్వాత గూళ్లు వెయ్యాలని నూచించారు. గ్రామాలలో వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉండాలని, పంట నష్టాలను జిల్లా అధికారులకు ఎప్పటి కప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు చెప్పారు.

