హైదరాబాద్ మే 22(జే ఎస్ డి ఎం న్యూస్) :
హనుమాన్ జయంతి సందర్బంగా తార్నాక లో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూమహాపురుషుడు రాముడికి ప్రియమైన శిష్యుడు హిందువుల ఆరాధ్య దేవుడైన హనుమంతుడి జయంతి సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
హనుమాన్ ఆశీస్సులతో యావత్ దేశ, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి వర్షాలు పడి పాడి పంటలతో సుభిక్షంగా గ్రామాలు బాగుండాలనికోరుకుంటున్నాను అన్నారు.దేశం కోసం పోరాటం చేస్తున్నా సైనికులకు హనుమాన్ ఆశీస్సులు ఉంటాయని వారికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను .దేశం వైపు ఎవరు కన్నెత్తి చూడాలని భావించిన హనుమాన్ ఆశీస్సులతో హనుమాన్ ఇచ్చిన శక్తితో మనదేశం పైకి వచ్చిన ఉగ్రవాధులను వేటాడి వెంటాడి వారిని తరిమికొట్టే శక్తిని అందించాలనీ ఆయన కోరుకున్నారు.




