ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాపేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలను, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్)ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు.
తొలుత జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మాతా శిశు వైద్యశాలను సందర్శించి, ఆసుపత్రిలోని ఓపి రిజిస్ట్రేషన్ విధానాన్ని సంబంధిత రిజిస్టర్స్ ను పరిశీలించారు. జనరల్ ఓపి వార్డును, ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, ఆపరేషన్ థియేటర్ ను, ఫోస్ట్ నెటల్ వార్డు, కాన్పుల వార్డు, స్టెరిలైజేషన్ రూమ్ ను, యాంటినెటల్ వార్డు ను తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలతోపాటు నిర్వహణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు పై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, వైద్యులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) సందర్శించి ఆభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ వార్డులను, చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. పేషంట్స్ కు అందిస్తున్న భోజనం జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో అలసత్వాన్ని ప్రదర్శించారాదనీ జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు సత్వరం వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వైద్యులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలను, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్)ను విజిట్ చేసి చేస్తున్న మరమ్మతు పనులను పరిశీలించడం జరిగిందన్నారు. మాతా శిశు వైద్యశాలలో ఎం.ఎన్ .బి.యూ యూనిట్ పనులు జరుగుచున్నవని, 10 రోజుల్లో సంబందిత పనులు పూర్తీ చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. అలాగే జిజిహెచ్ లో సదరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం వచ్చిన వారితో మాట్లాడటం జరిగిందని, వారు కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెరుగైన వైద్య సేవలు అందిచేలా వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అలాగే జిజిహెచ్ లో కూడా ఎం.ఎన్ .బి.యూ యూనిట్ పనులు పురోగతిలో వున్నాయని, పురోగతిలో వున్న మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, రద్దీ ప్రదేశాల్లో, సభలు, సమావేశాల సమయంలో తగిన దూరం పాటించడం, రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించడం, ముఖ్యంగా చేతులను శుభ్రంగా కడుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనుపడితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట డిసిహెచ్ఎస్ డా శ్రీనివాస నాయక్, మాతా శిశు వైద్యశాల సుపరింటెండెంట్ డా వెంకటరావు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్) సుపరింటెండెంట్ డా ఏడుకొండలు, సంబంధిత ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *