కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి.

కడప మే 24(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా కారును ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం లో శ్రీకాంత్,శిరీష్, హర్షిణి ,రిషి మృతి చెందినట్లు గా పోలీసులు తెలిపారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించారు. మొత్తం 7 మంది కారులో ఉన్నట్లు తెలుస్తోంది . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *