మహిళలకు స్ఫూర్తి సాధ్వి అహల్యా భాయ్ – గో సంఘంలో ప్రేరణత్మక సమావేశంలో బిజెపి నాయకురాలు బి. విజయ రావు

భారత దేశంలో వినతికెక్కిన రాజులతో పాటు ఎందరో మహారాణులు సైతం దేశాన్ని సస్యశ్యామలంగా, శత్రు దుర్భేద్యంగా ప్రజాహితంగా ఏలిన వారు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రగణ్యులు సాధ్వి అహల్య భాయి ఒకరిని, 300 సంవత్సరాల క్రితం ఇండోర్ రాజధానిగా 30 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యముగా రాజ్యపాలన చేసిన రాజమాత సాధ్వి అహల్య భాయి అని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు.  

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివారం సాయంత్రం అహల్య భాయి త్రిశత జయంతి ఉత్సవాల కోకన్వీనర్ బి. విజయరావు అధ్యక్షతన స్థానిక బాపూజీ గోశాల నందు ఏర్పాటు చేసిన అహల్య భాయి జయంతి పక్షోత్సవాల సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాధా రమణ గుప్తా మాట్లాడుతూ… దైవ భక్తి కలిగి, సాటి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అహల్య భావించేవారని, వారి భక్తి, మంచి నడవడికను గమనించిన మల్హర్ రావు తమ కుమారునకు భార్యగా తగినదని భావించి 7 సంవత్సరాల వయసు గల అహల్యను 10 సంవత్సరాల తమ కుమారుడు ఖండేల్వార్ కు ఇచ్చి వివాహం చేశారని తెలిపారు.
కాలక్రమంలో భర్త మరణించగా అప్పటి సామాజిక పరిస్థితులను సతీసహగమనం చేయాలని భావించగా మామ, దేశ ప్రజలు వద్దని వారించారు. వారి యొక్క మామ అహల్య  భాయ్ కి  యుద్ధ విద్యలు నేర్పించారు. మామ మరణించిన తర్వాత, బిడ్డ చిన్నవాడు అయినందున  దేశ రక్షణ బాధ్యతలను స్వీకరించి.  అప్రతిహసంగా 30 సంవత్సరాలు ఇండోర్ రాజధానిగా రాజ్యపాలన చేశారు. వారి పాలనలో ప్రజల సంక్షేమం. ప్రజల రక్షణ, దోపిడి దొంగలు థగ్గుల నుండి రక్షణ, నేత కార్మికులకు బాసటగా మల్లేశ్వరం చీరలను అభివృద్ధి చేసినారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆలయాల అభివృద్ధి, భక్తులకు వసతి గృహాలు, కోనేరు వంటి సదుపాయాలు కల్పించినారు. అంతటి మహాసాధ్వి అహల్య బాయ్ మహిళామూర్తులకు స్పూర్తివంతమైన నాయకురాలుగా కీర్తించబడ్డారని వివరించారు.
    
భారత దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ హిందూదేశంలోని స్పూర్తివంతమైన మహిళలను ప్రపంచానికి తెలియ చెప్పడానికి అహల్య భాయ్ త్రిశత జయంతి పక్షోత్సవాలను నిర్వహించలని పిలుపునిచ్చారు. అని తెలిపినారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మీ అందరికీ అహల్య బాయ్ గురించి తెలుపుటకు చాలా సంతోషంగా ఉన్నదని, వారి విగ్రహాన్ని ప్రభుత్వ అనుమతితో అమ్ము ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలో నెలకొల్పటానికి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అర్పించడం జరిగినదని అమ్ము ఫౌండేషన్ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు తెలిపారు.

ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము, జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, మండల అధ్యక్షురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, శ్రీ బాపూజీ గో సంఘం కోశాధికారి నరసింహారావు, చేవూరి వాసు, గాయత్రి పరివార్ సభ్యులు కోట లక్ష్మి , రజిని కుమారి, కోటా ప్రసాదు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *