జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ)గా తాళ్లూరు వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులను నియమిస్తూ బుధవారం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ క్రిటికా శుక్లా ఉత్తర్వులు జారీ చేసారు. తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ కశాశాల ను అభివృద్ధి బాటలో నడుతున్న కొండపల్లికి డీఐఈఓ (ఎఫ్. ఏ. సి)గా నియమించటం పట్ల అధ్యాపకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
