పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ చెయ్యాలి – తహసీల్దార్ సంజీవ రావు

రేషన్ డీలర్లు రేషణ్ దుకాణాల వద్ద పండుగ వాతావరణాన్ని కల్పించి రేషన్ సరుకులను పంపిణీ చేయ్యాలని తహసీల్దార్ సంజీవ రావు కోరారు. జూన్ నెల నుండి ఎండీయూ వాహనాలు రద్దు అయి రేషన్ దుకాణాల వద్ద బియ్యం వగైరాలు తీసుకోవాల్సి రావటంతో డీలర్లకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ దుకాణాల వద్ద ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లు లీగల్ మెట్రాలజీ వారిచే తనిఖీ చేయించి దృవీకరణ పత్రం పొందుపరచాలని చెప్పారు. దుకాణా బోర్డును అందరికి కనిపించేలా ఏర్పాటు చేసి అందులో అథరైర్డ్ డీలర్ పేరు, జాయింట్ కలెక్టర్, ఆర్ డీఓ, తహసీల్దార్ పేరు, ఫోన్ నంబర్లు ఉండేలా చూడాలని కోరారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు నిత్యావనర నరుకులు పంపిణీ చెయ్యాలని కోరారు. 65 సంవత్సరములు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు డీలర్లు వారి ఇంటి వద్దకే నరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, విఆర్ఓ చంధ్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *