కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి పరామర్శ

ముండ్లమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో అనారోగ్యానికి గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలోని పూరిమెట్లలో ఇటీవల ఆపరేషన్ చేయించు కున్న పార్టీ నాయకులు భాస్కరరెడ్డిని ఆయన పరా
మర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసు కున్నారు. ఈదరలో ఇటీవల ఆపరేషన్ చేయిం చుకున్న పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మహేంద్రారెడ్డి తండ్రిని పరామర్శించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉల్లగల్లు, పసుపుగల్లు, శింగనపాలెం, పోలవరం గ్రామాల్లో పార్టీ కార్యక ర్తలను ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు మండల పార్టీ కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ రత్న రాజు,దర్శి నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, , చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూదిదేవర అంజయ్య, మాజీ సర్పంచ్ అప్పిరెడ్డి, సింగన్న పాలెం సర్పంచ్ గీతాంజలి, కృష్ణారెడ్డి, గురవారెడ్డి, వెంగళరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *