పారదర్శకంగా రేషన్ అందించడమే రాష్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

రేషన్ పంపిణీలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా రేషన్ అందించడమే రాష్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి
పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలం, తూర్పు నాయుడుపాలెం లో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న లతో కలసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించి, రేషన్ ను ప్రజలకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకువచ్చి ఎండియు వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒక చోట ఉంచి రేషన్ ఇవ్వడం జరిగేదని, వాహనం ఎప్పుడొస్తుందో తెలియక కార్డుదారులు ఇబ్బంది పడేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతీ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం బియ్యం, పంచధార ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవచ్చు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భవిషత్తులో రేషన్ షాపులను సూపర్ మార్కెట్ లగా మార్చి నాణ్యమైన నిత్యావసర సరుకులను పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 46 లక్షల రేషన్ కార్డులు ఉండగా, ప్రకాశం జిల్లాలో 6 లక్షల 61 వేల 206 కార్డులు ఉన్నాయన్నారు. కొండపి నియోజక వర్గంలో 92, 257 కార్డులు కలవని, ఈ గ్రామంలో 617 రేషన్ కార్డు దారులు ఉన్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం బయట నుండి కేజీ 45.50 రూపాయలకు బియ్యం ను కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుచున్నదన్నారు. అలాగే పంచాదారు కేజీ 49.50 లకు కొనుగోలు చేసి ఏ ఏ వై కార్డు దారులకు కేజీ 13 .50 రూపాయలకు, పి హెచ్ హెచ్ కార్డు వారికి అర్ధ కేజీ 17 రూపాయలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నెరవేరుస్తూ ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. హామీల్లో భాగంగా పించన్ ను పెంచి ప్రతి నెలా ఒకటవ తేదీనే అందచేయడం జరుగుచున్నదన్నారు. దీపం పధకం కింద ఉచిత గ్యాస్ పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అలాగే త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ క్రింద కేంద్ర ప్రభుత్వ ఇచ్చే మొత్తంతో కలిపి 20 వేల రూపాయలు, విద్యార్దులు కుటుంబంలో ఎంతమంది పిల్లలు వుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పధకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్.సి, బిసి లబ్దిదారులకు మూడు లక్షల రూపాయలు, ఎస్.టి లబ్దిదారులకు మూడు లక్షల 25 వేలు, ఓసి లకు రెండు లక్షల 50 వేలు ఇంటి నిర్మాణానికి ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నెలకు 4 వేలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. దివ్యాంగులకు 6 వేల నుండి 15 వేలు, దీర్గకాలిక వ్యాధిగ్రస్తులకు 10 వేలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ ఒక్క సంవత్సరం లోనే తూర్పు నాయుడు పాలెం గ్రామంలో 14 కోట్ల రూపాయల తో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ… రేషన్ కార్డుదారులకు ఏటువంటి ఆసౌకర్యం లేకుండా రేషన్ అందించాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాలు వద్దే రేషన్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు. కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ మాట్లాడుతూ…జిల్లాలో 1392 రేషన్ దుకాణాల ద్వారా 6 లక్షల 61 వేల 206 కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుంచి మ.12 గం.వరకు,తిరిగి సా.4.00 నుంచి రా.8.00 గంటల వరకు తమకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు నుంచి రేషన్ తీసుకోవచ్చన్నారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతినెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మ.12 గంటల నుంచి సా.4 గం.వరకు సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా కార్డుదారుల ఇంటి వద్దకే రేషన్ అందించబడుతుందన్నారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఏర్పడితే ప్రతి రేషన్ షాపు వద్ద క్యు ఆర్ కోడ్ వుంచడం జరిగిందని, దాన్ని ద్వారా తమ అభిప్రాయాలను, పిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
ఒంగోలు ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తూర్పు నాయుడు పాలెం ఎస్.సి కాలనీ,ఓల్డ్ ఎస్ సి కాలనీలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల కు, సైడు కాలువలకు మంత్రి శంఖుస్థాపన చేసి మొక్కను నాటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *