12 వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ గేమ్స్ లో విజేతలుగా నిలిచిన మహిళా క్రీడాకారులను ఆదివారం మినీ స్టేడియంలో జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి, పలు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరైన్నారు. ఈ పోటీలు మే 31 జూన్ 2 వరకు 18 జిల్లాలకు చెందిన సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మరియు మాస్టర్ విభాగాలకు చెందిన క్రీడాకారులు 422 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ… మహిళలు క్రీడా రంగంలోనూ ఎంతో ప్రతిభ కనబరుస్తున్న విషయం ఈ విజయాలతో స్పష్టమవుతోందన్నారు. శ్రమ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ విభాగంలోనైనా మహిళలు ముందుకు రావచ్చునన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారురాలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకుని జీవితంలో వారికి ఎదురయ్యే గెలుపోటములను సరిసమానంగా స్వీకరించినప్పుడు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. క్రీడలతో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించడం సంతోషకరమని, భవిష్యత్తులో మరింత మంచి నైపుణ్యాన్ని కనబర్చి ప్రకాశం జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. అందరూ తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. ప్రకాశం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించి నేషనల్ స్ధాయిలో విజేతలగా నిలిచిన వారికి పోలీస్ శాఖ తరుపున బహుమతులు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు తాలూకా సీఐ విజయ కృష్ణ, డిఎస్ డి ఓ. రాజరాజేశ్వరి, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి భక్తధ్రువుడు, ప్రకాశం జిల్లా పవర్ లిప్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి.పవన్ కుమార్, క్రీడాకారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

