బేగంపేట్, జూన్,5 (జే ఎస్ డి. ఏం న్యూస్) :
ముషీరాబాద్ గాంధీ అస్పత్రి లో చికిత్స పొందుతూ ఒక వ్యకి మృతి చెందిన సంఘటన గురువారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బేగంపేట్ పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని పుట్ పాత్ వద్ద ఉండే శివ (38)పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 25తేదీ న ప్లాజా జెంక్షన్ వద్ద తాగిన మత్తులో గాయలతో పడి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు శివ ను గుర్తించి చికిత్స నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం శివ మృతి చెందాడు. మృతుడిది కర్ణాటక రాష్టంలోని గుల్బర్గా అని పోలీసులు తెలిపారు. మృతుని శవాన్ని గాంధీ అస్పత్రిలో ని మార్చురిలో భద్రపరచినట్లు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
