ఆరోగ్యానికి హని కల్గించే కల్తీపాలు తయారు చేస్తే కఠిన చర్యలు- తాళ్లూరు ఎస్సై ఎస్.మల్లిఖార్జునరావు

ప్రజల ఆరోగ్యానికి హనికల్గించే విధంగా కల్తీ పాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఎస్. మల్లాఖార్జునరావు హెచ్చరించారు. కొందరు అక్రమ సంపాదనకు మార్గం ఎంచుకుని పెట్టు బడి లేకుండా సంపాదించాలన్న తలంపుతో కల్తీపాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటా లాడుతున్నారన్నారు. పలుగ్రామాల్లో కల్తీపాలు తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు గురువారం సాయంత్రం పాలకేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ …కొందరు పాలకేంద్రంనిర్వహకులు అధికంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ఎక్కువ పాలు అమ్మి సొమ్ము చేసుకునేందుకు వక్రమార్గాలు ఎంచుకుని కల్తీ పాలు తయారు చేసి గతంలో పట్టుబడ్డారని తెలిపారు. పలుగ్రామాల్లో కల్తీపాలు తయారు చేసి విక్రయిస్తుండగా అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా మార్పు రావటం లేదన్నారు. గ్రామాల్లో పాలు సేకరించే పాలకేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. ఎక్కువ పాలు విక్రయించే పాలకేంద్రాలను తనిఖీలుచేస్తున్నట్లు తెలిపారు. కల్తీపాలుతాగితే ప్రజలు ఆనార్యోగం పాలవుతున్నారని, పాలవిక్రయదారులు కూడా కల్తీ విదానాన్ని విడనాడా
లన్నారు. కల్తీపాలు తయారు చేస్తూ పట్టుబడితే తగు కఠిన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. గ్రామాల్లో కల్తీపాలు తయారు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారాన్ని పోలీసులకు తెలపాలని, వారి పేర్లు గోప్యతగా వుంచటం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలో ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *