ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పొలీసు స్టేషన్ ల పరిధిలో బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షలు చేసి డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 23 మందిని మంగళవారం ఒంగోలు కోర్టు లో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10,000/- జరిమానా విధించారు. (మొత్తం రూ. 2,30,000/- జరిమానా)
మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైతే తీవ్రముగా గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరిగి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని, మీ మీద ఆధారపడే కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్స్ రూల్స్ పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. ప్రమాదాల నివారణకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ల వద్ద స్టిక్కరింగ్, స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేశామని, నో హెల్మెంట్, సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ లోడింగ్ డ్రంకన్ డ్రైవింగ్ వలన కలిగే ప్రమాదాల గురించి వాహనదారులకు వివరిస్తూ రోడ్డు భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
