బేగంపేట్ ప్రకాశ్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. ….

బేగంపేట జూన్ 10(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ప్రకాశం నగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం జిహెచ్ఎంసి, జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు.. ప్రకాశం నగర్ నాలా పరివాహక ప్రాంతాలను అయన సందర్శించారు.అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాలా కుచించుకుపోవడంతో వెంటనే నాలా విస్తరణ పనులను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాలా విస్తరణకు సంబంధించి కొలతలను తీసుకున్న హైడ్రాధికారులు నాలా విస్తరణ పెంచి ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. బేగంపేట ప్రధాన రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్ లో నాలా కుచించుకుపోయి చెత్తాచెదారం నిలవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లకపోవడంతో రహదారులపై కాలనీలోకి వర్షపు నీరు చేరుకున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. కుచించకపోయిన నాలా ను విస్తరణ చేసి అందులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హైడ్రా కమిషనర్ తో పాటు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు జీ హెచ్ ఎం సి,జలమండలి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *