బేగంపేట జూన్ 10 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన బండి రమేష్ ను సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ నాయకులు విశాల్ సుధాం ఆధ్వర్యంలో మంగళ వారం కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశాల్ సుధాం బండి రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించి తెలంగాణా తల్లి విగ్రహాన్ని బహుకరించారు.బండి రమేష్ ను కలిసి అభినందించిన వారిలో విశాల్ సుధాం తో పాటు బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్.రమాదేవి, అరుణ్ గౌడ్,వి.చిరంజీవి,బాలా,పర్వేజ్ తదితరులు ఉన్నారు.
