ఆరోగ్య భద్రత సదస్సు నిర్వహించడం అభినందనీయం…..టి జీ ఎస్ పి ఎఫ్ కమాండెంట్ ,ఆరోగ్యభద్రత సెక్రటరీ ఎన్.త్రినాథ్.

హైదరాబాద్ జూన్ 10(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
ఆరోగ్య భద్రత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది అని,ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య రక్షణ కోసం జాగ్రత్తలు పాటించాలని టీ జీ ఎస్ పి ఎఫ్ కమాండెంట్,ఆరోగ్యభద్రత సెక్రటరీ ఎన్.త్రినాథ్ అన్నారు.మంగళవారం టీ జీ ఎస్ పి ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో బుద్ధభవన్ లో ఆరోగ్య భద్రత సదస్సు నిర్వహించారు.ఇందులో భాగంగా సిబ్బందికి సాధారణ పరీక్షలతో పాటు,కంటి పరీక్షలు,పంటి పరీక్షలు నిర్వహించారు. యశోదా ఆస్పత్రి,శ్రీ నేత్రాలయ ,సౌజన్య డెంటల్ ఆస్పత్రుల సహకారంతో ఈ సదస్సుకు హాజరైన వారికి పరీక్షలు నిర్వహించారు. టీ జీ ఎస్ పి ఎఫ్ డీ జీ పీ డా.అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్య భద్రత సెక్రటరీ ,కమాండెంట్, ఎన్.త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్.త్రినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రతి రోజు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం వ్యాయామం,నడక,యోగా లతో పాటు శారీరక శ్రమ కలిగించే పనులు చేయాలని పిలుపు నిచ్చారు. టీ జీ ఎస్ పి ఎఫ్ సిబ్బంది ఆరోగ్య భద్రత లో భాగస్వాములైన ఆస్పత్రులను త్రినాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డా.సందీప్ తుల క్యాన్సర్ పైన సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ జంగయ్య, అసిస్టెంట్ కమాండెంట్ బాబురావు, ఇన్స్పెక్టర్ సన్యాసిరావు ఎస్సైలు, ఏ ఎస్సైలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *