తాళ్లూరు హౌసింగ్ లే అవుట్లో గృహానిర్మాణాల తీరును బుధవారం జిల్లా హౌసింగ్పీడీ శ్రీనివాస ప్రసాద్ పరిశీలించారు. హౌసింగ్ పథకంలో ప్రభుత్వం అందిస్తున్న లబ్దిని వివరించారు. త్వరగా నివాసాలు పూర్తి చేసుకోవాలని కోరారు. హౌసింగ్కు ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహకం ఇళ్ల నిర్మాణానికే ఉ పయోగించుకోవాలని కోరారు. ప్రతి వారం నివాసాల ఇచ్చిన లక్ష్యం మేరకు పురోగతి ఉండేలా హౌసింగ్ సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు. హౌసింగ్ ఎఈ హనుమంత రావు, వర్క్ ఇన్స్ఫెక్టర్ రవి కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాపి రెడ్డిలు పాల్గొన్నారు.
