తాళ్లూరు మండలంలో అన్ని శాఖల అధికారులు, నచివాలయాల్లో పంచాయితీలలో శనివారం యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, తహసీల్దార్ సంజీవ రావు, ఎంఈఓలు జి నుబ్బయ్య, నుధాకర రావులు తమశాఖల పరిధిలో అమలు అవుతున్న యోగాంధ్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. తూర్పుగంగవరంలో గుజ్జుల మణికంఠ రెడ్డి ధ్యాన యోగ మండలంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, ఎస్పై మల్లిఖార్జున రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. తహసీల్దార్ సంజీవ రావు ముఖ్య అతిథిగా పాల్గొని యోగాంధ్ర ప్రాముఖ్యతను వివరించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఉదయం యోగాంధ్ర ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులచే యోగననాలు చేయించారు. అనంతరం ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఎంఈఓ- 2 సుధాకర రావు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. తూర్పుగంగవరంలో పీహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక, వైద్యులు శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఓ చంధ్రశేఖర్ ల ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది యోగ కార్యక్రమాలు నిర్వహించి న్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసారు.




