యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కా ద్దు – డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం జిల్లా ను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సంకల్పం తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా , ఎస్పీ ఏ ఆర్ దామోదర్ , శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ,బి.ఎన్ విజయ్ కుమార్ – ఘనంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహణ

యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని, డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం జిల్లా ను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సంకల్పం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఎస్పీ ఏఆర్ దామోదర్ లు పిలుపునిచ్చారు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, బి ఎన్ విజయ కుమార్, జిల్లా ఎస్.పి ఏ ఆర్ దామోదర్, ఎపి మాల సంక్షేమ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా. పి. విజయకుమార్, లైవ్ స్టాక్ డెవెలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా అధికారులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ సందర్భంగా ‘’ నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్సిస్తూ పెద్దఎత్తున ర్యాలీలు, అవగాహన సదస్సులు జరుపుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రకాశం జిల్లాను కూడా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా ప్రతి కళాశాలలో, స్కూల్స్ నందు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లా లో కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించి కేవలం 4 నెలల కాలంలోనే ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు, అరికట్టుటకు ప్రభుత్వం పరంగా అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, అన్నీ వర్గాల ప్రజలు, స్వచ్చంద సంస్థలు కూడా భాగస్వాములై ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ విద్యార్థుల భవిష్యత్తునకు బంగారు బాట వేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు.

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ… డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగం వలన కలుగు దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుచున్నదన్నారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టుటకు, నియంత్రించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో 30 మందితో ఈగల అనే విభాగాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. నేడు యువత మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారని వీటిని అరికట్టే దిశగా మాదకద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం వలన నివారణ సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళుతూ చదువుపట్ల శ్రద్ద చూపాలని సూచించారు.

సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయ కుమార్ మాట్లాడుతూ… జూన్ 26తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రవాణా మరియు వినియోగాన్ని నిర్ములించాలన్న ఉద్దేశ్యంతో ఈగిల్ అనేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్నదన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి భవిష్యత్తు, ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారుతుందని, దాని ప్రభావం ఆ కుటుంబం పై కూడా పడుతుందన్నారు. యువత, విద్యార్ధులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించాలన్నారు.

జిల్లా ఎస్.పి ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ… యువత కొత్తదనం పట్ల ఆకర్షితులవుతూ ఒకసారి వాడి చూద్దామనే భావనలో ఉండి డ్రగ్స్ వినియోగం దిశగా ప్రభావితులవుతారన్నారని. ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే వారు జైలుకు వెళ్ళడం, వారికి ఉద్యోగ అవకాశాలు పొందలేక జీవితం నాశనం అయ్యే పరిస్థితి కలుగుతుందన్నారు. మంచి భారతదేశం, మంచి ఆంధ్రప్రదేశ్ ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటూ విద్యార్ధులకు, యువతకు అవగాహన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాల, కళాశాలలో కమిటీలను ఏర్పాటుచేసి వారికి డ్రగ్స్ వినియోగం వలన కలుగు దుష్పలితాలను వివరిస్తూ పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నియంత్రణ దిశగా అలవాటు పడిన వారిని డి – అడిక్షన్ సెంటర్లో చేర్పించడం, సరఫరా చేస్తున్న వారిని గుర్తించడం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు గంజాయిని అరికట్టుటకు ఐజి నేతృత్వంలో ప్రతి జిల్లా లో 30 మంది తో ఈగిల్ అనే విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 41 కేసులను రిజిస్టర్ చేసి 22౦ మందిని గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. అలాగే వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా కూడా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉండడానికి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమం అనంతరం పొలిసు పరేడ్ గ్రౌండ్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, బి ఎన్ విజయ కుమార్, జిల్లా ఎస్.పి ఏ ఆర్ దామోదర్, ఎపి మాల సంక్షేమ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా. పి. విజయకుమార్, లైవ్ స్టాక్ డెవెలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా అధికారులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Back to list
Next జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -అపరిష్కృతంగా ఉన్న లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశం -ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రికవరీ శాతం పెంచాలి – మహిళలు/చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి -మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి -రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకొవాలి -ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని సమర్థవంతంగా కట్టడి చేయాలి -రానున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చెయ్యాలి -క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్‌శాఖకు గుర్తింపు తీసుకురావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *