ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికారంగానిది కీలక పాత్ర అని, అటువంటి పత్రి కారంగం ప్రస్తుతం దేశవ్యా ప్తంగా కార్పొరేట్ల చేతిలో ఉందని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఒంగోలు విష్ణుప్రియ కన్వెన్షన్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీ యూడబ్ల్యూజే) రాష్ట్ర మహాస భలో గురువారం ఉదయం జరిగిన సభాకార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతి థిగా పాల్గొన్నారు. ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ ప్రసంగిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో సైతం పత్రికలు ఎంతో కీలక పాత్ర పోషించాయని అన్నారు. అయితే ప్రస్తుతం అనేక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కార్పొరేట్ల ఆధీనంలో ఉండి వారికి అను కూలమైన రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నా యన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయిందని, ఇది ఎంతో బాధాకరమని అన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కోసం చేసే ఏ పోరాటానికైనా తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
మరొక అతిథిగా పాల్గొన్న పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కె.మురళీమోహన్ మాట్లాడుతూ తన అభివృద్ధికి ముఖ్యమైన కారణం పత్రికారంగం, ఏపీయూడ బ్ల్యూజే అని, ఒక పాత్రికేయునిగా పనిచేసిన తాను సమాజం గురించి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. శాసనమండలి సభ్యులు కంచెర్ల శ్రీకాంత్ ప్రసం గిస్తూ ఏపీయూడబ్ల్యూజే మహాసభలలో ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక పాత్రికేయుని కుమారునిగా తాను పాల్గొంటున్నందుకు ఆనం దంగా ఉందని, తన తండ్రి కంచెర్ల రామయ్య పాత్రికేయునిగా ఎంతో విశేషమైన సేవలు అందిం చారని ఆయన నుంచి జీవితంలో ఎన్నో నేర్చుకు న్నానని అన్నారు. ఒంగోలు నగర కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రజాస్వా మ్యంలో పత్రికలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పత్రికారంగంపై ఆయన రాసి చదివిన కవిత విశేషంగా ఆకట్టుకుంది.
పలు తీర్మానాలకు ఆమోదం
మహాసభలో పలు తీర్మానాలను ఆమోదిం చారు. ముందుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియ న్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస రెడ్డి ఏపీయూడబ్ల్యూ జేకు సంబంధించి బ్యాలెన్స్ షీట్ ను సభ ముందు ప్రవేశపెట్టగా సభ దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా యూనియన్ కానిస్టిట్యూషన్ లో అవసరమైన మార్పులను ఆయన సభముందు ఉంచగా వాటిని ఆమోదించారు. ఇక చిన్నపత్రికల మనుగడకు అవసరమైన చర్యలు, పాత్రికేయుల రక్షణకు చట్టం, గ్రామీణ ప్రాంత పాత్రికేయుల
సమస్యల పరిష్కారం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి పలు జిల్లాల ప్రతినిధులు
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి పలు జిల్లాల ప్రతినిధులు తీర్మానాలను ఏకగ్రీ ప్రవేశపెట్టగా వాటిని సభ ఏక వంగా ఆమోదించింది.
ఆనంతరం సభాధ్యక్షుడు సుబ్బా రావు మాట్లాడుతూ ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర మహాసభలను మూడు రోజులు ఒంగోలులో నిర్వ హించటానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం, వారికి అవసర మైన సహాయ సహకారాలు అందించే విషయంలో ఏపీయూడ బ్ల్యూజే ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలువురు ఐజేయూ నాయకులు, ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రా ప్రతినిధులు, మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రతి వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొ పాల్గొన్నారు. ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ సురేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్వీ రమణ, దాసరి కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా క్షుడు వెంకట్రావు తదితరులు దాసరి కన అసోసియేషన్ అధ్య నిర్వహణా సహకారాన్ని అందించారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నూతన కమిటీ ఏకగ్రీవం -రాష్ట్ర అధ్యక్షుడుగా ఐవీ సుబ్బారావు -ప్రధాన కార్యదర్శిగా కంచల జయరాజ్ -కోశాధికారిగా వల్లూరి వెంకటేశ్వర్లు
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా ఐవీ సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అమరావతికి చెందిన కంచల జయరాజ్ ఎన్నిక య్యారు. గత మూడు రోజులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని మహాసభల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా ఐ వి సుబ్బా రావు, ప్రధాన కార్యదర్శిగా అమరావతికి చెందిన కంచల జయరాజ్, ఉపాధ్యక్షులుగా కాకినాడ జిల్లాకు చెందిన కె స్వాతి ప్రసాద్, ఏలూరు జిల్లాకు చెందిన కె మాణిక్యరావు, కృష్ణ అర్బన్ జిల్లాకు చెందిన చావా రవి, కర్నూలు జిల్లాకు చెందిన జి కొండప్ప, కార్యదర్శులుగా అనకాపల్లి జిల్లాకు చెందిన సిహెచ్ బిఎల్ స్వామి, పల్నాడు జిల్లాకు చెందిన విద్యాధరణిమురళి, ప్రకాశం జిల్లా కు చెందిన అలుగుల సురేష్, తిరుపతి జిల్లాకి
చెందిన ఎంపీ ఆర్ రాజు, కోశాధికారిగా నెల్లూరు జిల్లాకు చెందిన వల్లూరు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా విజయనగరం జిల్లాకు చెందిన మునగపాటి సూర్యనారాయణ రాజు, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అట్లవాక కిషోర్ కుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన వై కాలేశ్వరంరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బి నాగరాజు, వైయస్సార్ కడప జిల్లాకు చెందిన చెన్నుపల్లి వెంకటరెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన జి
శ్రీనివాసులు, బి అక్కులప్ప, ఎన్టీఆర్ జిల్లాకి చెందిన యు వెంకట్రావు, బాపట్ల జిల్లాకు చెందిన సిహెచ్ రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వై మురళీకృష్ణ, అనంతపురం జిల్లాకు చెందిన సిహెచ్ దుర్గాప్రసాద్ రెడ్డి, నంద్యాల జిల్లాకు చెందిన కె.వి శ్యామ్సుందర్ లాల్, గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.కె నాగూర్ మీరా, సత్య సాయి జిల్లాకు చెందిన డి బాబు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎం ఎన్ వి ప్రసాద్ ఎంపికయ్యారు.







