ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన వీరయ్య హత్య కేసులోని ముద్దాయిలు బూరగుంట్ల వినోద్ కుమార్ , ఓబిలి నాగరాజు , ఆళ్ల సాంబశివరావు , గొల్ల రిత్వేంద్ర బాబు ఉరఫ్ నాని లను దర్యాప్తు అధికారైన ఒంగోలు డిఎస్పీ రావిపాటి శ్రీనివాసరావు గారు గత నాలుగు రోజులుగా పోలీస్ కస్టడీకి తీసుకొని వారిని విచారించినారు. వారిలో వినోద్ కుమార్, సాంబశివరావులను విచారించు సమయంలో వారు తెలిపిన వివరాలు మేరకు వారు హైదరాబాద్ వెళ్లి ముప్పా సురేష్ ని ఇంట్లో కలిసినట్లు, ఆ సమయంలో సురేష్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కొరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వినోద్ కుమార్ కు ముప్ప సురేష్ తన వ్యాపార డైరెక్టర్ ద్వారా సుమారు లక్ష రూపాయల వరకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపినారు.
ఈ రోజు మధ్యాహ్నం ఓబిలి నాగరాజు మరియు గొల్ల రిత్వేంద్ర బాబులను డిఎస్పీ విచారణ నిమిత్తం బయటకు తీసుకుని వెళ్ళగా, ఆ సమయంలో ఓబిలి నాగరాజు తన బట్టల బ్యాగును పడవేసిన ప్రదేశం చూపిస్తానని చెప్పి లింగారెడ్డి అపార్ట్మెంట్ వీధిలో చివరిగా మంగమూరు రోడ్డు కలిసే వద్ద కాలవ దాకా తీసుకువెళ్లినట్టు, తర్వాత వారిని జీపులో ఎక్కిస్తుండగా వారిద్దరూ పోలీస్ వారిని నెట్టి పారిపోవుటకు కొంత దూరం పరిగెత్తగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై గార్డ్ ఇంచార్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు.