ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవ ఎన్నిక – హర్షం వ్యక్తం చేసిన ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము నాయుడు.

ఏపీ భాజపా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసన మండలిలో భాజపా ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్, ఎబివిపి, బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. మాధవ్… భాజపా సీనియర్ నేత, దివంగత చలపతిరావు కుమారుడు. ఆయన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు.
మాధవ్ ఎన్నిక పట్ల ప్రకాశం జిల్లా నాయకులు, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు హర్షం వ్యక్తం చేసారు. సాధారణ కార్యకర్త నుండి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మాధవ భవిష్య బిజెపి నాయకులకు స్ఫూర్తివంతమని శ్లాంఘించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *