ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్చంద సంస్థ కన్వినర్ కపురం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో దర్శి అర్చన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పిహెచ్ సి వైద్యులు డాక్టర్ చేతన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డిప్యూటి డిఎం హెచ్ ఓ డాక్టర్ సుజన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సీజనల్ వ్యాథుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూధన రావు మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాథులు రాకుండా దోమల నియంత్రణకు ప్రజలకు సహకరించాలని కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్చంద సంస్థ కన్వినర్ కపురం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…. వైద్యులు కనిపించే దేవుళ్లు అని ప్రపంచంలో వైద్యుల సేవలు వెలకట్టలేని వని అనేక విపత్తులలో అది రుజువైనదని వివరించారు. అనంతరం డిప్యూటీ డీఎం హెచ్ఎ సుజన, మలేరియా అధికారి డాక్టర్ మధుసూధన రావులను, డాక్టర్ చేతన్లను ఘనంగా సన్మానించారు. జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డిప్యూటి పారా మెడికల్ అధికారి సుబ్బా రెడ్డి, దర్శి మలేరియా అధికారి బసవా రెడ్డి, హెచ్ వి సుభాషిణి, సుశీలమ్మ, ఆరోగ్య, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

