రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం భోజనం పధకం మెనూ ను కచితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
మంగళవారం మద్దిపాడు మండలం, గార్లపాడు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సహ పంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం అమలు పై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రతిరోజు ఇలాగే ఉంటుందా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ప్రభుత్వం ఇటీవల సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు కదా, సన్న బియ్యంతో భోజనం ఎలా వుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే మెనూ మార్చిన తరువాత ఇప్పుడు బాగా వుందని విద్యార్ధులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. కచితంగా వారంనకు ఒకసారి మధ్యాహ్నం భోజనం పధకాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తహసీల్దార్ ను, ఎంపిడిఓ లను ఆదేశించారు. పాఠశాలలో ఈ సంవత్సరం , ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, ఎ క్లాస్ లో ఎంత మంది విద్యార్ధులు ఉన్నారు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం భోజనం పధకం మెనూ ను ఖచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనంను విద్యార్ధులకు అందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
అనంతరం గార్లపాడు గ్రామంలోని రేషన్ షాపును సందర్శించి రేషన్ షాపు వెరిఫికేషన్, ఆన్ లైన్ ప్రక్రియను, సరఫరా చేసిన స్టాక్ ను స్వయంగా పరిశీలించి, ఎంతమంది కార్డుదారులు వున్నారు , ఎంత రేషన్ సరఫరా చేసారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న నేపధ్యంలో రేషన్ కార్డు దారులందరికి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ ఖచ్చితంగా జరగాలన్నారు. అలాగే వృద్దులకు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ అందించే కార్యక్రమం పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.
కలెక్టర్ వెంట తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఎంపిడిఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


