కూటమి ఏడాది పాలన ప్రజా రంజకం- మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంక టేశ్వరరెడ్డి

వైసీపీ అరాచక పాలనను ప్రజలు పాలద్రోలి
ప్రజా రంజకమైన కూటమి అధికారంలోకి తీసుక వచ్చిన ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలు అన్నివిధాలుగా సంతోషంగా వున్నారని మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా
తాళ్లూరు ఎస్టీకాలనీలో మండల టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. టీడీపీ మండల యువ నాయకులు ఐ. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన
హామీ మేరకు మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, పెన్షన్ పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, పశుపోషకులకు పశువుల షెడ్లు మంజూరు చేసి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నదన్నారు. గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పనుల తాలుకూ పత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు, శాగం కొండారెడ్డి, రాచకొండ వెంకట్రావు, పిన్ని కరమేష్, ఆదినారాయణ, రామకోటిరెడ్డి గ్రామటీడీపీ
అధ్యక్షులు మారం వెంకట రెడ్డి, మెలికా అంజమ్మ,మాగంటి శ్రీను
నాదెండ్ల శ్రీను పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *