ఎస్సీ విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాల నంబర్లు సరిచూసుకోవాలని జిల్లా
సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్, నోడల్ అధికారి లక్ష్మా నాయక్ కోరారు. తల్లికి వందనం నిధులను 1వ తరగతి విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఖాతాలను ప్రభుత్వం నగదు జమ చేస్తుందని చెప్పారు. బ్యాంకు, ఆధార్, ఎన్పీ సీఐ పోర్టల్లో ఈనెల 8వ తేది లోపు అనుసంధానం చేసుకొని సంబంధిత కాఫీని వేల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్’ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు జిరాక్స్ కాఫీని అందించాలని కోరారు. జిల్లాలోని అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత వేల్ఫేర్ అసిస్టెంట్స్ విద్యార్థులకు నహకరించాలని ఆయన ఓక ప్రకటనలో కోరారు.
