ఒకే దేశం, ఒకే ప్రధాని అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ స్థాపకులు, పూర్వ జనసంఘ్ నాయకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఇంచార్జీ తీగల సత్యవతి
ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యవతి
మట్లాడుతూ… హిందూ ధర్మం కోసం రాజకీయ పార్టీని స్థాపించిన నాయకుడని, ముస్లిం లీగ్ జిన్నా ద్విజాతి చర్యలను బాహాటంగా వ్యతిరేకించారని, క్యాబినెట్లో మంత్రి గా పనిచేస్తూ కూడా దేశ విభజనను వ్యతిరేకించారని కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జన సంఘ్ ఏర్పాటు చేశారని, తరువాతి కాలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగినదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు సీట్లు గెలిచి నేడు దేశంలోనే పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగి, వరుసగా మోదీ సారధ్యంలో మూడు పర్యాయాలు అధికారం చేపట్టి ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ దేశ రక్షణకు, ప్రజల సంక్షేమానికి పాటుపడుచున్నదని జిల్లా బీజేపీ నాయకులు తీగల కేదారనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా నాయకరాళ్లు కుమారి, చంద్రకళ, అంజమ్మ, వెంకటరత్నం, శ్రావణి, శాంతమ్మ , తదితరులు పాల్గొన్నారు.
