కొండేపి మరియు హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లను వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి -స్టేషన్ పరిధిలలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా…. పలు రికార్డుల పరిశీలన -పక్కా ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరిత గతిన పరిష్కరించాలి -మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలి -అసాంఘిక/చట్టవ్యతిరేక కార్యకలాపాలు కార్యకలాపాల అడ్డుకట్ట వేసేలా పటిష్ట బీట్ సిస్టంను ఏర్పాటు చేయాలి

వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి , ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తో కలిసి కొండేపి మరియు హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ముందుగా ఐ జి పి సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాలను, పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీస్ స్టేషన్ లలో నిర్వహిస్తున్న ఎఫ్ఐఆర్ ఇండెక్స్, కేసు డైరీలను, రిజిస్టర్లు, పలు రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుకోవాలని, ప్రతి అంశాన్ని రికార్డులలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని, రికార్డులు అప్డేట్ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు. రికార్డ్, పోలీస్ స్టేషన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు.

స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి, నమోదైన కేసుల వివరాలను తెలుసుకొని వాటి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు, పురోగతి అడిగి తెలుసుకున్నారు. విచారణ దశలో ఉన్న గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసులు, దీర్ఘకాలంగా కేసులు పెండింగ్ లో ఉండుటకు గల కారణాలను సమీక్షించి, క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్ తో కేసుల్లో విచారణ వేగవంతం చేయడానికి అధికారులకు పలు సూచనలు చేశారు.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, గుడ్ ట్రైల్ మానిటరింగ్ ద్వారా కేసులలో శిక్షణ శాతం పెంచాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులలో ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, అనుమానాస్పద వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్ సేకరించి వారి గత నేరచరిత్ర గూర్చి వాకబు చేయాలి. పాత, కొత్త నేరస్థులపై నిరంతర నిఘా ఉండాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను సామరస్యంగా విని సమస్య పరిష్కారమయ్యేలా వారితో మెలగాలని తెలిపారు.

మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి ఆప్ గురించి , వారి కి గల రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసువారి సహాయాన్ని పొందేలా వారిలో ధైర్యాన్ని నింపాలన్నారు.

ప్రతి గ్రామ పరిధిలో పల్లెనిద్రలు చేస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుని గొడవలకు ఆస్కారం లేకుండా చూడాలని తెలిపారు.

నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాలలో, వాణిజ్య సముదాయాలు, నిర్మానుష ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చేలా చూడాలని తెలిపారు.

డ్రోన్ కెమెరాల వినియోగం మరింత పెంచుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనవాయితీగా జరిగే జాతరలు, ఉత్సవాలను పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు, అవాంఛనీయ శక్తుల ఆగడాలకు అవకాశం లేకుండా పటిష్ట నిఘాని ఏర్పాటు చేయాలని చెప్పారు.

నేటి కాలంలో ఎక్కువగా జరుగుతున్న రహదారి ప్రమాదాలలో ద్విచక్ర వాహనం వినియోగించే వారే అధికం హెల్మెట్ ధరించకపోవడం వలన చాలామంది మృత్యువాత పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కేసులను ఛేదించాలని, ఒక నిర్దిష్ట ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం చేసేలా కృషి చెయ్యాలని సూచించారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని, పాత నేరస్థులు రిపీటెడ్ అఫెండర్స్ పై నిఘా ఉంచాలని, పెట్టి కేసులను నమోదు చేయాలన్నారు. రోడ్డు సేఫ్టీ నియమాలు, సైబర్ నేరాలు, చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్గించాలని ఆదేశించారు.

గ్రామ/వార్డు సచివాలయాల మహిళా పోలీసులతో సమావేశమయి వారి పనితీరును సమీక్షించారు.

పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది యొక్క సంక్షేమంలో రాజీ పడవద్దని, వారి యొక్క ప్రతి సమస్యను తెలుసుకుని దానికి అనుగుణంగా వారికి విధులు కేటాయించాలని తెలిపారు.

ఈ వార్షిక తనిఖీ లో గుంటూరు రేంజ్ ఐ జి వెంట కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, కొండేపి సీఐ సోమశేఖర్, కనిగిరి సీఐ ఖాజావలి, పామూరు సీఐ బీమా నాయక్, కనిగిరి సబ్ డివిజన్ ఎస్సైలు ప్రేమ్ కుమార్, మాధవరావు, హనోక్, రమేష్ బాబు, శ్రీరామ్, కోటయ్య మరియు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *