హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై ఎం పి లకు అవగాహన………

హైదరాబాద్ జులై 19(జే ఎస్ డి ఎం న్యూస్ ):
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి ఎంపీలకు అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బిజెపికి చెందిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పి.బలరాం నాయక్, కుందూరు రఘువీర్, డాక్టర్ మల్లు రవి, ఆర్.రఘురామ్ రెడ్డి, సురేష్ కుమార్ షెట్కర్, ఎం. అనీల్ కుమార్ యాదవ్, బీజేపీ నుండి ఈటెల రాజేందర్, ఎం.రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రెండో దశ విస్తరణ కు సంబంధించి కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్రానికి చెందిన ఎంపీ లు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని మంత్రులు కోరారు. రెండో దశకు సంబంధించి అంశాలపై అవగాహన కల్పిస్తూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుకి సంబంధించి వివిధ సందేహాలను ఆయన నివృతి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *