ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం, బాధితులకు తక్షణ న్యాయం అందించడమే మా లక్ష్యం -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్

ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యల గురించి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులుకు విన్నవించుకున్నారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అందిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, ఎక్కువగా భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తన వ్యవసాయ పనుల నిమిత్తం పాత ట్రాక్టర్ అవసరమయ్యే పలుచోట్ల తిరుగుతూ ఉన్న సమయంలో, కడప జిల్లా, దువ్వూరు మండలానికి చెందిన ఒక వ్యక్తి తన వద్ద పాత ట్రాక్టర్ ఉందని రూ. 1,80,000/- తీసుకున్నాడు. మూడు నెలలు గడిచిన తర్వాత ట్రాక్టర్ కు సంబంధించిన వ్యక్తి నాపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని, తనకు ట్రాక్టర్ లేదా డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి మోసం చేశాడని, దర్శి మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

తన కుమారుడికి మున్సిపాలిటీలో ఉద్యోగం మరియు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి, గిద్దలూరుకు చెందిన వ్యక్తి తన వద్ద నుంచి రూ.5,50,000/- తీసుకొని, ఉద్యోగం లేదా ఇల్లు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని, గిద్దలూరు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, డిటిసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *