రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి జిల్లాలో డి ఆర్ ఆర్ ఎం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో త్రాగునీటి వసతి లేకపోవడం గమనించి, ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడం, ప్రధానోపాధ్యాయుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తదుపరి రాజుపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి 100 కేజీలు బియ్యం తేడా ఉండటాన్ని గమనించి మండల తహసిల్దార్ ద్వారా బియ్యాన్ని స్టాక్ లోనికి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా కంప్లైంట్ బాక్స్ విధిగా ఉండాలని ఆదేశించారు. నెలలో ఒకరోజు తప్పనిసరిగా మెడికల్ ఆఫీసర్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించి తగు సూచనలు తీసుకోవాలని తెలిపారు. అలాగే హెల్త్ కార్డులు జారీ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మహిళా కార్యదర్శి ద్వారా డ్రాప్ అవుట్ కు సంబంధించిన పిల్లల వివరాలను తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలబాలికలకు సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సైబర్ క్రైమ్ తదితర అంశాలపై బాలబాలికలకు అవగాహన కల్పించాలని, జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా రక్షణ, సంరక్షణ అంశాలు మరియు బాలలకు సంబంధించిన చట్టాలపై జిల్లా న్యాయ మరియు పరివీక్షణ అధికారి రత్న ప్రసాద్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పిల్లలకు 10 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకోవాల్సిన టీకాలు వేయడం అవసరం అని డిఎం & హెచ్ ఓ వారిద్వారా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలబాలికలు ఇరువురు 5 సంవత్సరాలలోపు అంగన్వాడి సెంటర్లోనూ తర్వాత ప్రాథమిక పాఠశాలలోనే ఆ తర్వాత హైస్కూల్లోనూ తదుపరి జూనియర్ కాలేజీలోను ఉండేలాగా విధిగా ప్రభుత్వ పాఠశాలలో, తర్వాత ప్రభుత్వ హై స్కూల్ లోనే అలాగే ప్రభుత్వ కాలేజీల్లోనూ చదివే విధంగా ప్రతి విద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ లోనూ పిల్లలకు అనుకూలంగా ఉండే టీచర్ ను ఎంపిక చేసి వారి ద్వారా పిల్లలను అభివృద్ధిలో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందని అధికారులను ఆదేశించారు. గవళ్ళ పాలెం స్కూల్లో ఇద్దరు పి ఈ టి టీచర్లలో ఒక టీచర్ ను రాజుపాలెం హై స్కూల్ లో ఉండే విధంగా చూడాలని విద్యాశాఖ అధికారులను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశించారు. స్కూల్ పరిసరాలను పరిశీలించి స్కూల్ కి 100 మీటర్లు పరిధిలో షాపులు ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యురాల తెలియజేశారు. విద్యా కమిటీ ప్రెసిడెంట్, స్కూల్ కి వచ్చే పిల్లలకు ఆటో సర్వీస్ ప్రొవైడ్ చేసి తద్వారా పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునట్లు తెలిపారు. కమిటీ తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తపరిచారు. ఇదేవిధంగా మిగిలిన స్కూల్లో కూడా కమిటీలు తగు చర్యలు తీసుకొని పిల్లలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. తదుపరి కొత్తపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ ను తనిఖీ చేశారు. బియ్యం, గుడ్లు, బెల్లం, రాగి పిండి లో ఉన్న వ్యత్యాసం గుర్తించి అధికారులను ప్రశ్నించారు. గుడ్లు బయట నుండి కొని తీసుకురావడం మరియు బిల్లు లేకుండా తీసుకురావడాన్ని గమనించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సిందని అధికారులను ఆదేశించారు. రాగి జావ ఇవ్వకుండా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించి షో కాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు , సి ఎం వో ఆధ్వర్యంలో టీచర్లకు ఆవాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాలల సంరక్షణ కమిటీ సభ్యురాలు డి నీలిమ, న్యాయ మరియు పరివీక్షణ అధికారి రత్న ప్రసాద్, కొత్తపట్నం ఎస్ఐ వేముల సుధాకర్, సోషల్ వర్కర్ సమాధానం పాల్గొన్నారు.

