తాళ్లూరు మండల కేంద్రంలోని ఎం ఎన్ ఆర్ పెట్రోలు బంకును, రజానగరంలో రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ బి వి రమణా రావు పరిశీలించారు. ఫిల్లింగ్ స్టేషన్ పరినరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నాణ్యతను, క్వాటింటిలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రజానగరంలో రేషన్ దుకాణాన్ని పరిశీలించి సమయ పాలన పాటించాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విఆర్ చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

