కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు సముచిత స్థానం -కాంగ్రెస్ పార్టీ దర్శి ఎస్సి సెల్ అధ్యక్షులు గా కొడవటిజాన్ నియామకం –

కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు సముచిత స్థానం ఉంటుందని
దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎస్సీ విభాగానికి నియోజకవర్గ అధ్యక్షులుగా కొడవటిగంటి ప్రశాంత్ కి కైపు వెంకటకృష్ణా రెడ్డి , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మన్నం ప్రసన్న కుమార్ రాజ్ లు నియామక పత్రం అందజేసారు.
మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహల కి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం మాఫియా ఇసుక మాఫియా గురించి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ దర్శి లో అద్దాంతరంగానిలిచినా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, దొనకొండలోని తాగునీటి సమస్యల, దొనకొండలో పరిశ్రమల, మొగలి గుండాల రిజర్వాయర్ పూర్తి చేయాలని కోరారు .దర్శి లో హాస్పిటల్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతు న్నారు. అదేవిదంగా నియోజకవర్గంలో ఉపాధి లేక యువత పడుతున్న ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు అమలు కాకపోవడం గురించి మీడియా ముందు వివరించడం జరిగింది. త్వరలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలియజేయడం జేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పుట్లూరు కొండారెడ్డి ఇక మీదట పార్టీ గ్రూపుల్లో వైయస్ షర్మిల రెడ్డి గురించి గానీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గురించి కానీ అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మన్నం ప్రసన్నకుమార్ రాజు మాట్లాడుతూ… నియోజకవర్గంలో సుమారు 60 వేల ఎస్సీ ఓటర్లు ఉన్నారని… ఇంటి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కార్యక్రమంలో చేసిన మంచి పనుల గురించి వివరించాలని అన్నారు.
రాష్ట్రంలో లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులు మీద దాడులు అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయని, ఈ పరిణామాల్ని ఎదుర్కొనేటందుకు కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటుందనిఅన్నారు.
జిల్లా ఉపాధ్యక్షులు గోరంట్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ… దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కి కంచుకోట అని…అందరం కలిసికట్టుగా పని చేసి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతంచేయడం జరుగుతుందన్నారు.
నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ … నియోజకవర్గంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరిగినేని నరసయ్య, మాజీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, దర్శి , దర్శి పట్టణ, తాళ్లూరు , దొనకొండ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి, సిరిమల్లె పౌలేష్, కూకట్ల వీరబ్రహ్మం, రామిరెడ్డి శివారెడ్డి, నాయకులు కమల్ సాయిబ్, సుబ్బా రెడ్డి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *