ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు- ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ -బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తతో ఉండాలి: జిల్లా ఏఆర్ ఏఆర్ దామోదర్

అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్నిపురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన దర్శి మండలం, తూర్పువీరాయపాలెం గ్రామానికి విచ్చేయుచున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులు, సిబ్బందితో PTS ఫంక్షన్ హాల్ లో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారికి కేటాయించిన స్థలాలకు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని సూచించారు. హెలిప్యాడ్ నుండి ప్రజా వేదిక ప్రాంతం వరకు, సీఎం కాన్వాయ్ వచ్చే సమయంలో అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. హెలిప్యాడ్, వీఐపీ రూట్ బందోబస్తు, ప్రజా వేదిక,కార్యకర్తల సమావేశం కార్యక్రమం, పార్కింగ్ ప్రదేశాలలో భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

బయట నుండి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. సీఎం కాన్వాయ్ మార్గంలో ఏర్పాటుచేసిన రూట్ మార్గం వద్ద జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా తమ విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహణ…

జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి హెలిప్యాడ్‌ నుండి ప్రజా వేదిక జరిగే ప్రాంతం వరకు నిర్వహించిన సి.యం కాన్వాయ్ ట్రయిల్‌ రన్‌ను పర్యవేక్షించి అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియ చేశారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేటప్పుడు బందోబస్త్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్పెషల్ పార్టీ, పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాన్వాయ్ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా బందోబస్త్ విధులు నిర్వహిస్తూ సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ వెంట దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, ఒంగోలు డి.ఎస్.పి ఆర్ శ్రీనివాసరావు, మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు, కనిగిరి సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, దర్శి సీఐ రామారావు, త్రిపురాంతకం సీఐ అసాం, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *