పారదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నగదు బదిలీ కార్యక్రమం చీమకుర్తి మండలం నాయుడుపాలెం లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేసి రైతుల ను వీక్షింపజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని రైతులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు, ఎరువుల సరఫరా మరియు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించబడింది. రైతులకు భారతీయ జన ఉర్వరక పథకం (బిజె యూపీ ) పరిధిలో లభ్యమయ్యే ఎరువులపై విపులంగా వివరించారు.
పారదీప్ ఫాస్ఫేట్స్ సంస్థ ప్రదర్శించిన ఉత్పత్తుల్లో భారత్ టీఎస్‌పీ, భారత్ ఎన్ 20-20-0-13, జిప్మైట్ ప్లస్, నానో శక్తి డీఏపీ, బయో 20, ఇంపాక్ట్ వంటి విశిష్ట ఎరువులు ఉన్నాయి. రైతులు ఈ ఉత్పత్తులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులుగా మార్కెటింగ్ ఆఫీసర్ పి. ప్రభాకర్, జె.కె.ఎస్. హరికృష్ణ రెడ్డి, డీబీటిఎస్ వెంకట్రావు మరియు గ్రామంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.


