కంప్యూటర్ ఆపరేటర్ ఏసోబుకు ఆర్థిక సాయంఅందజేసిన మానవత సంస్థ సభ్యులు

గుండె కు స్టంట్ వేయించు కుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దర్శి మండలంలోని తూర్పుచౌటపాలెం గ్రామానికి చెందిన ఎంఆర్సి కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ ఏసోబుకు మానవత సంస్థ ఆధ్వర్యంలో రూ.5000 సాయం చేశారు. దాతల సహకారంతో వచ్చిన మరో రూ.22 వేలు కలిపి మొత్తం రూ.27 వేలను ఆదివారం అందజేశారు. వారికి ఏసోబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్, వైస్ చైర్మన్ వాకా జనార్దన్ రెడ్డి, కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్ బసవయ్య, ప్రధాన కార్య దర్శి జీ వేణు, ట్రెజరర్ తిరుపతిరెడ్డి, గౌరవాధ్యక్షుడు రాజకేశవరెడ్డి, హెల్త్ మెంబర్ సుశీల, సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటరావు, సుధాక ర్ రావు, కరుణానిధి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *