స్వచ్చ సర్వేక్ష బృందం బెల్లంకొండ వారి పాలెం పంచాయితీలో క్షేత్ర సర్వేను నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పారిశుధ్యం, ఇంకుడు గుంతలు పరిశీలించి స్వచ్ఛతపై ప్రజలను పలు ప్రశ్నలు అడిగి సేకరించారు. పాఠశాలను, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచి పోశం సుమలత, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ గూడ సరస్వతి, ప్రభాకర్ రెడ్డి, గ్రామకార్యదర్శి శ్రీ వల్లి, డీపీఓ కార్యాలయ సిబ్బంది ఖాజావలి, రవి, విజయవాడ సెంట్రల్ కార్యాలయ సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
