తాళ్లూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విషసర్పాలు సంచరిస్తుండటంతో బాలికలు ఆందోళన చెందుతున్నారు. జులై 25వ తేదీ రాత్రి 9వతరగతి చదువుతున్న ప్రిమ్ సెసను కాలుకు ఏదో కుట్టినట్లు అనిపించి నిద్ర లేచి చూడగా రక్తం వస్తుడ డంతో ఆబాలి కను తాళ్లూరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. కాలికి రెండు గాట్లు పడినట్టు గుర్తించి పాముకాటు వాక్సిన్ వేసి రాత్రికిరాత్రే అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ కు తరలిం చారు. ఆబాలిక నాలుగు రోజుల పాటు రిమ్స్ చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఆదేరోజు పైఅంతస్తులో
గల డార్క్ రూమ్ లో ఇంటర్ బాలికకు పెద్ద నల్లటి పాము కన్పించటంతో భయాందోళన చెంది పరుగులుతీశారు. మిగిలిన బాలికలు కూడా భయంతో కిందకు వచ్చారు. రెండు రోజుల కిత్రం ఓ బాలిక పైఅంత స్తులో దుస్తులు ఆరేస్తుండగా భవనం గోడ ఆనుకుని పెద్ద సర్పం వెళుతుండటాన్ని గమనించి తోటి విద్యార్థి నులకు చెప్పగా వారిచూసి భయాందోళన చెందారు. కేజీబీవీ భవనం వెనుకవైపు మరుగు ఎక్కువగా ఉంది. అక్కడ వున్న చెట్లు ఏపుగా పెరిగాయి. విషసర్పాలు చెట్లపైగా పాకుతూ పైఅంతస్తులో గల కిటికీల ద్వారా డార్క్ రూమ్ కి వస్తున్నాయని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. విద్యాలయంకు అదనపు గదుల నిర్మాణాలు జరుగుతూ ఉండటంతో సామగ్రి, వ్యర్థ పదార్థాలు అక్కడే వేయగా మరుగుఏర్పడింది. మరుగు తొలగించక పోవటం, ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయక పోవటంతో కేజీబీవీలో తరుచూ విషసర్పాలు సంచరిస్తున్నాయి. పది రోజుల్లో మూడు సర్పాలు కన్పించటంతో బాలికలు రాత్రి వేళ నిద్రపోవాలంటే భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు స్పందించి కేజీబీవీ విద్యాలయం పరిసరాల్లో ఉన్న మరుగును తొలగించి విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాళ్లూరులోనికేజీబీవీలో విషసర్పాల సంచారం – విద్యార్థినుల ఆందోళన
05
Aug