నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ వద్ద న్ వాస్కులర్ డే సందర్భంగా వాక్.జెండా ఊపి ప్రారంభించిన సినీ నటుడు రాజీవ్ కనకాల. బేగంపేట కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ ఆద్వర్యం లో నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా వాక్‌థాన్. మరియు అవగాహన కార్యక్రమం.

బేగంపేట ఆగస్టు 6(జే ఎస్ డి ఎం న్యూస్) :
చిరునవ్వుతో జీవించడానికి ఒక మైలు నడవండి – నినాదంతో వాకతాన్అంప్యూటేషన్‌లకు నో చెబుదాం అని డాక్టర్ నిషాన్ రెడ్డి అన్నారు.నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా, బేగంపేట కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, వాస్క్యులర్ టీం తరఫున, వాస్క్యులర్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రత్యేక వాక్‌థాన్‌ను నిర్వహించింది.
“వాక్ ఎ మైల్ టు లివ్ విత్ ఎ స్మైల్” అనే పేరుతో బుధవారం ఉదయం 6:30 గంటలకు సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ లో జరిగింది.ఈ కార్యక్రమం ప్రధానంగా “అవయవాన్ని కాపాడండి, జీవితాన్ని నిలబెట్టండి– జీవితం కాపాడండి అంప్యూటేషన్‌లకు చెబుదాం వద్దని” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా, వాస్క్యులర్ వ్యాధులు సరైన సమయంలో చికిత్స అందకపోతే, అంప్యూటేషన్ (చేతులు లేదా కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి) వరకు దారి తీసే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తూ కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ ప్రజారోగ్యం పట్ల ఉన్న నిబద్ధతను చాటి చెబుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్సల్టెంట్ వాస్క్యులర్ & ఎండోవాస్క్యులర్ సర్జన్ – ఆర్టరీ, వేన్ & డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ డా.నిషాన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో వాస్క్యులర్ వ్యాధుల భయంకర పరిస్థితిపై వివరించారు.ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 25,000 మంది వాస్క్యులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్లను కోల్పోతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగులలో ఇది అధికంగా కనిపిస్తుంది. అయితే, వీటిని త్వరితంగా గుర్తించి, సరైన వైద్యచర్యలు తీసుకుంటే, 80% వరకు అంప్యూటేషన్‌లను నివారించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలకు ఈ నివారించదగిన సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన వాక్ ను నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థిని విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు పాల్గొన్న అవగాహన వాకతాన్ ను ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల జండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన శరీరంలో ముఖ్యమైన కాళ్లు చేతుల్లో తలెత్తే వాస్క్యులర్ సమస్య కారణంగా ఒక్కోసారి కాలును కూడా పూర్తిగా తీసేయాల్సి వచ్చే పరిస్థితులకు కూడా దారితీస్తుందని ఇటీవల మా బంధువులకు ఒకరికి ఎదురైన ఈ సమస్య కారణంగా తెలుసుకున్నానని తెలిపారు. ఇలాంటి సమస్యల తలెత్తకుండా ప్రతి ఒక్కరూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు తగిన వ్యాయామం, వాక్ చేయాలని తెలిపారు. సీనియర్ మెడికల్ జర్నలిస్ట్ & యాంకర్ మాధవి సిద్దం మాట్లాడుతూ వేస్కులర్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు కిమ్స్ సన్ షైన్ బేగంపేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నవ్వుతూ జీవించడానికి ఒక మైలు నడవండి అనే నినాదంతో అవగాహన వాకతాను నిర్వహించడం మంచి కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాధవ్ వాక్ లో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. అవగాహన వాక్కులో డాక్టర్ సి హెచ్ గోపాల్, డాక్టర్ నివేదిత, డాక్టర్ నవ వికాస్, హాస్పిటల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *