తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆరోగ్యవంతమైన బిడ్డలకు పోషణ ఇవ్వాలని తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాగంబోట్ల పాలెం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇచ్చినట్లయితే బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుందన్నారు. అంగన్వాడీ కార్య కర్తలు, ఆశా కార్యకర్తలు గృహ సందర్శనకు వెళ్ళినప్పుడు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ జి ఓ చంద్రశేఖర్, పిహెచ్ఎన్ రమణమ్మ, హెచ్ ఏ గోపి నాయక్, ఎమ్. ఎల్. హెచ్ పి శ్రీలత , ఆరోగ్య కేంద్ర సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, చంటి బిడ్డ తల్లులు పాల్గొన్నారు.

