ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తు మంచి గుర్తింపు వస్తుందని వక్తలు అన్నారు.
బొద్దికూరపాడు నచివాలయంలో గురువారం గత ఐదు సంవత్సరంల నుంచి పనిచేసి బదిలీలపై పలు ప్రాంతాలకు వెళ్లిన ఉద్యోగులకు ఘన వీడ్కోలు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులకు స్వాగతం పలికారు. నర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద రెడ్డి, ఎంపీటీసీ కొప్పుల బాల కోటయ్య, టిడిపి నాయకులు రమణా రెడ్డి, సుబ్బారెడ్డి లు పాల్గొని గతంలో సెక్రటరీగా పనిచేసి బదిలీపై వెళ్లిన షేక్ సహనాజ్ బేగం, అల్లం వెంకటేశ్వర్లు, డిజిటల్, వేల్ఫేర్, అగ్రికల్చర్, వెటర్నరీ అసిస్టెంట్ లను ఘనంగా నన్మానించి వారు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. వెలుగు వారి పాలెం, లక్కవరం సర్పంచిలు కోటేశ్వర రమ్మ, వరలక్ష్మి, గ్రామ కార్యదర్శి రామాంజనేయులు, మాధవస్వామి గుడి మాజీ చైర్మన్ పులి అంజి రెడ్డి, రిటైర్డు హెచ్ఎం ఎన్ అంజి రెడ్డి, సంగం యోగి రెడ్డి, వార్డు మెంబర్లు పులి బజారు రెడ్డి, చీమల బూచు రాజు, స్వామి యోగయ్య, కోయిల గుంట పేరమ్మ, నగిలి నాగేశ్వర రావు, గంగవరపు బాల కోటి రెడ్డి, ఆరోగ్య, ఆశ, అంగన్ వాడీ టీచర్లు, గ్రీన్ అంబాసిడార్స్ పాల్గొన్నారు.


