శివరామపురం పరిధిలో విద్యుత్ నూతన లైన్లకు తీగ ఏర్పాటు చేయనున్న నేపధ్యంలో శుక్రవారం విద్యుత్ సేవలను అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్ ఎఈ ఎం రామక్రిష్ణ తెలిపారు. వినియోగదారులు అసౌకర్యాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శివరామపురం విద్యుత్ నబ్ స్టేషన్ పరిధిలో నివాసాలకు, వ్యవసాయ విద్యుత్ సైతం ఉండదని వివరించారు.
