రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం సాయంత్రం విజయవాడ ఏపీ సచివాలయంలోని సి.ఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశమై పీ4 కార్యక్రమం అమలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు, జిల్లాల్లో పిపిపి విధానంలో ప్రాజెక్టులు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్సన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఏజెంట్ స్పేస్ తదితర అంశాలపై తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, డిఆర్ డిఎ పిడి నారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, సిపిఓ స్వరూప రాణి, ఎపిఐఐసి అధికారులు తదితర పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేసేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద చుపాలన్నారు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని, రోడ్లు, పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పి 4 కార్యక్రమం అమలుపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ మరియు సేవా కార్యక్రమాలను నూరుశాతం అమలు చేసి ప్రజలనుండి సానుకూల అభిప్రాయాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

