మాల మహానాడు కార్యకర్తలపై నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిన మారణ కాండను మరువ లేమని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య అన్నారు. తాళ్లూరులో అండేద్కర్ నగర్లో సోమవారం గుర్రాల తొక్కినటాటలో చనిపోయిన మాల మహానాడు కార్యకర్తలు పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ లకు నివాళులు అర్పించారు. నాడు దివంగత పివి రావు ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన వర్గీకరణకు వ్యతిరేక కార్యక్రమంలో నచివాలయ ముట్టడికి ఐదు లక్షల మంది కార్యకర్తలు వచ్చారని అన్నారు. నాడు లాఠీ చార్జీలతో, గుర్రాలతో చంద్రబాబు ఆదేశాలతో మాలలపై దమన కాండ జరినదని వివరించారు. వర్గీకరణ పేరుతో మాలలను మాదిగలను విభజించి పాలించాలని కుట్రలతో వర్గీకరణ తెరపైకి తెచ్చి వర్గికరించటం జరిగిందని అన్నారు. ఈ వర్గీకరణ చెల్లదని అప్పటి కోర్టు కొట్టివేసినప్పటికి మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక సుప్రీం కోర్టు ద్వారా అక్రమ తీర్పులు ఇప్పించారని వివరించారు.
అమరులైన మాలలకు నివాళులు అర్పించిన దార
11
Aug