ఉత్తమ పాఠశాలల అవార్డుకు ఎంపికైన చుండి ఆదర్శ పాఠశాల

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ పాఠశాలల ఎంపికలో నెల్లూరు జిల్లా తరఫున వలేటివారిపాలెం మండలం చుండి ఆదర్శ పాఠశాల ఉత్తమ పాఠశాలగా ఎంపిక అయినట్లు చుండి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ పడమటి వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ పాఠశాల అవార్డుల ఎంపికకు రాష్ట్రవ్యాప్తంగా 10 పాఠశాలలను ఎంపిక చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారని చెప్పారు. యాజమాన్యాల వారీగా పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత, అత్యధిక సరాసరి మార్కులు సాధించిన పాఠశాలలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారని అన్నారు. వీరికి ఆగస్టు 15వ తేదీన విజయవాడలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేయు నున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న విజయవాడలో జరిగే అవార్డుల ప్రధానంలో చుండి ఆదర్శ పాఠశాల తరఫున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల
మీదుగా అవార్డు ను అందుకోనున్నట్లు ఆయన తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *